ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లి(టి) కొంచవలి దర్గా జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది పొలాల పండగ అనంతరం పౌర్ణమి తర్వాత మంగళవారం జాతర నిర్వహించడం ఆనవాయితీ. డీసీసీబీ ఛైర్మన్ అడ్డి బోజారెడ్డి దర్గాను దర్శించారు. భక్తులకు జొన్న ఘట్క, మేక మాంసం ప్రసాదంగా అందించారు.