సత్యసాయి: పుట్టపర్తి సత్యసాయి బాబా, శిర్డీ సాయి బాబా మానవాళికి అందించిన సందేశం ఒక్కటేనని నృత్య నాటిక ద్వారా తెలియజేశారు. ‘షిరిడికే మహల్సపతి పర్తికే కౌన్’ పేరుతో సాయికుల్వంత్ మందిరంలో బాలవికాస్ విద్యార్థులు నాటిక ప్రదర్శించారు. శివపార్వతుల నృత్యం ఆకట్టుకుంది. అనంతరం నాయకత్వ కోర్సు పూర్తిచేసిన యువతకు ఆర్జే రత్నాకర్ సర్టిఫికెట్లు అందజేశారు.