PLD: రొంపిచర్ల నుంచి కర్లగుంట వరకు రూ. 2 కోట్ల వ్యయంతో తారు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే చడలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.