TG: మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా మల్లన్నసాగర్ నుంచి HYDకు 20టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టుకు గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. రూ.7,360 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు.