ATP: గుంతకల్లులో సోమవారం 33 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ అలపాటి రాజా, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బూచి రాంప్రసాద్ హాజరయ్యారు. అనంతరం లబ్ధిదారులకు రూ. 15,66,886 విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిదన్నారు.