ప్రకాశం: ఒంగోలులోని ధారావారితోటలో జిల్లాలోని ఓ కరాటే అసోసియేషన్ నిర్వహించిన కరాటే బెల్ట్ ఎగ్జామ్కు 70 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 28 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పోటీలను జపాన్ కరాటే అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ డైరెక్టర్ రఘునాథబాబు పర్యవేక్షించారు. గెలుపొందిన విద్యార్థులను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు.