SDPT: గజ్వేల్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులర్పించారు. కాళోజి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకొని కొనియాడారు. తెలంగాణ భాషకు నేడు మంచి గుర్తింపు వచ్చిందన్నారు.