RR: షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా, మంగళవారం 24వ వార్డులోని నెహ్రూ విగ్రహం వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గతంలో ఇదే వార్డులో భారీ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో, మరో పెద్ద సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.