జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లా గుడ్డార్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ముగ్గురు సైనికులకు గాయాలయ్యాయి.