RR: హయత్నగర్ డివిజన్లోని బంజారా కాలనీలో ఉన్న హిందూ స్మశాన వాటిక అభివృద్ధి పనులను సోమవారం కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో వేగవంతం పెంచి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈ హేము నాయక్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.