ATP: రైతులు పండించిన పంటల సాగుకు యూరియా, DPA ఎరువులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోవిందు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు.