నేపాల్లో ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియా నిషేధంపై రాజధాని ఖాట్మండులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనలు ఉధృతం చేసింది. ఈ క్రమంలోనే ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా.. 100 మంది పైగా గాయపడ్డారు. ఖాట్మండుతో పాటు 10 నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది.