‘మిరాయ్’ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు తేజ సజ్జా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చూడాలని వుంది’ సినిమా కోసం వంద మంది బాల నటుల ఫొటోల నుంచి చిరంజీవి తన ఫోటోను ఎంపిక చేసుకున్నారని తేజ చెప్పాడు. ఆ తర్వాత నిర్మాత అశ్విని దత్ తన తండ్రిని ఒప్పించారని అన్నాడు. ‘ఆ రోజు మెగాస్టార్ నా ఫోటోను ఎంపిక చేసుకోకపోయి ఉంటే నా జీవితం మొత్తం మరోలా ఉండేది’ అని పేర్కొన్నాడు.