E.G: ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగంగా జిల్లాకు కొత్త అంబులెన్స్‌లు కేటాయించిందని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఈ మేరకు తొలి విడతగా 3 అంబులెన్స్‌లు వచ్చాయన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అంబులెన్స్‌లకు జెండా ఊపి ప్రారంభించారు.