మేడ్చల్: మల్కాజిగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రవణ్ పలు ఫిర్యాదులు చేశారు. మారుతినగర్, ఓల్డ్ మల్కాజిగిరి, నేరెడ్ మెట్, విష్ణుపూరిలలో పార్కుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని, లైబ్రరీకోసం ఒకగదిని కేటాయించాలని కోరారు. వర్షాల కారణంగా నిలిచిపోయిన రోడ్డుపనులను తిరిగి ప్రారంభించాలని అన్నారు.