రేపు జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. దీంతో పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని విపక్ష అభ్యర్థి ప్రచారం చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.