కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న సమస్యలపై ఈనెల 9న జరిగే ‘అన్నదాత పోరును’ విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపుచ్చారు. నందివాడ మండల పార్టీ కార్యాలయంలో సోమవారం అన్నదాత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంట సాగుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని నేతలు విమర్శించారు.