CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన దాత రామకృష్ణ రూ. 1,00,000 ఇవాళ విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ ఈవో కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.