NLG: చిట్యాల మండలం వట్టిమర్తి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జానకి జిల్లాస్థాయి అవార్డు స్వీకరించిన సందర్భంగా సింగిల్ విండో మాజీ ఛైర్మన్ నర్రా మోహన్ రెడ్డి, ఎంపీఎల్ పరిశ్రమ వీపీ అజయ్ కుమార్, జీఎం సదన్ బాబులు సోమవారం సత్కరించారు. విద్యార్థులకు ఉత్తమమైన సేవలు అందిస్తుండడం పట్ల ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ సాగర్ల నరేష్ పాల్గొన్నారు.