సత్యసాయి: జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలతో పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. డీఎస్పీ ఆదినారాయణ ప్రజలతో మాట్లాడి 65 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలు, సైబర్ మోసాలపై అధిక ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.