కడప: పులివెందుల టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి ప్రజల నుండి పలు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను. పులివెందుల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే నా ప్రధాన ధ్యేయం’ అని పేర్కొన్నారు.