KMM: ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.