VSP: జిల్లా కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 315 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 119, జీవీఎంసీకి చెందినవి 85, పోలీస్ శాఖకు సంబంధించినవి 21 ఉండగా వివిధ అంశాలకు, శాఖలకు చెందినవి మరొక 90 ఫిర్యాదులు ఉన్నాయి.