BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమని, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 12 జడ్పీటీసీ, 109 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కోసం 580 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.