AP: వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సమస్యలపై చర్చించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. సమావేశాలకు రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. సభలో చర్చించిన తర్వాత చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా, వైసీపీ గత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.