బీహార్ సమగ్ర ఓటరు సవరణ సర్వేపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారించింది. ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్‌ను పరిగణించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశించింది. అయితే, ఆధార్ కార్డు అధికారికంగా జారీ చేసిందో లేదో సరిచూడాలని తెలిపింది. అలాగే.. ఆధార్‌ను పౌరసత్వ ధ్రువీకరణగా అంగీకరించకూడదంటూ వ్యాఖ్యానించింది.