AP: అరకు కాఫీ పంటలో బెర్రీబోరర్ తెగులుపై ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా గిరిజన రైతులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కాఫీ రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. తెగులు పట్టిన కాఫీకి కిలో రూ.50లు చొప్పున చెల్లిస్తామని.. ఎకరాకు రూ.20 వేల వరకు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు.