WGL: బెస్ట్ అవైలబుల్ స్కీం నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్యు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సంబంధించిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం అజయ్ మాట్లాడుతూ.. గత 3 సంవత్సరాల నుంచి నిధులు రాలేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.