KMM: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ANMలపై పని భారం మోపి వారి ప్రాణాలను హరించవద్దంటూ ANMల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి.రామాంజనేయులు అన్నారు. సోమవారం AITUC ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. NCDతో పాటు ఆన్లైన్ యాప్లను రద్దుచేసి పని భారం తగ్గించాలని, ANMల సమస్యలు పరిష్కరించాలని కోరారు.