ATP: కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ సిద్ధమయ్యాయి. అనంతపురంలో 10న ‘సూపర్-6-సూపర్ హిట్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నాయి. అధికారంలోకి వచ్చాక మూడు పార్టీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది.