ప్రకాశం: హనుమంతునిపాడు మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర సోమవారం భవనిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మండలంలో దాదాపు 600 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు వృత్తి చేసుకొని జీవిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వారికి సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి అని కోరారు.