నల్గొండలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ –2025లో గుర్రంపోడ్ లిటిల్ ఛాంపియన్స్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో బంగారు, వెండి, కాంస్య పతకాలను కైవసం చేసుకుని తమ ప్రతిభను చాటుకున్నారు. సోమవారం ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ క్రీడల్లో రాణించిన విద్యార్థులను అభినందించినారు.