తెలంగాణ ఎన్నికల సమయంలో.. తనను గెలిపించమని రేవంత్ రెడ్డి తన సహాయం కోరాడని ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి బీహార్ ప్రజలను లేబర్స్ అని అవమానించారని విమర్శించారు. బీహారీలను అవమానించే ధైర్యం అతనికి ఎక్కడిది? అని ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. తన ప్రజలను అవమానించిన రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.