W.G: ఎరువుల కొరత నివారించి రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. ఎరువుల కొరత నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో తణుకు తహసీల్దార్ డి.అశోక్ వర్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఎరువులను బ్లాక్ మర్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.