GNTR: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్లస్టర్ మ్యాపింగ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని కొల్లిపర మండల సచివాలయ ఉద్యోగులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లుగా మారుస్తున్నారని వారు ఆవేదన చెందారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించమని అధికారులు చెబుతున్నారని, ఇది తమ విధులకు భిన్నమని పేర్కొన్నారు.