TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై BRS చెప్పేవన్నీ ఉత్తుత్తి కబుర్లేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. యూరియా ఇవ్వలేదు కాబట్టి ఓటింగ్‌కు దూరంగా ఉన్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. TRSను BRSగా పేరు మార్చినప్పుడే.. తెలంగాణ అంశాన్ని ఆ పార్టీ మర్చిపోయిందని విమర్శించారు.