BPT: బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎరువులు, పురుగుమందుల దుకాణాలు వాటి గోదాములను పరిశీలించిన అధికారులు, స్టాక్ వివరాలు, ధరల అమలును సరిచూశారు. ఎవరూ ఎరువుల కృత్రిమ కొరత సృష్టించరాదని ఎస్పీ స్పష్టం చేశారు.