AKP: రోలుగుంట జెడ్పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయులు పీవీఎం.నాగజ్యోతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకొని పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఆమెను పాఠశాలలో సోమవారం ఘనంగా సత్కరించారు. పాఠశాల స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు బ్యాండ్ వాద్యాలు, మార్చ్ పాస్ట్ చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పూలమాలలతో మెమోంటోతో ఘనంగా సత్కరించారు.