ASR: అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి విజయ్ తెలిపారు. చీడిపాలెం, నిమ్మలపాలెం, ఇసుకపట్ల గ్రామాల్లో పర్యటించిన ఆమె బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుస్తులు, రూ.25,000 నగదు అందించారు. బాధిత కుటుంబాలకు గృహాల మంజూరుకు అధికారులను ఆదేశించారు.