SDPT: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో 69వ జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు సిద్దిపేటలోని ప్రభుత్వ ఉన్నత (మల్టీపర్పస్) పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు STF జిల్లా కార్యదర్శి సౌందర్య ఒక ప్రకటనలో తెలిపారు. అండర్-14, 17 బాలబాలికలకు ఈ పోటీలు జరుగుతాయి. ఈ క్రీడాల్లో పాల్గొనే క్రీడాకారులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలు వెంట తీసుకురావలన్నారు.