VSP: విశాఖలోని పాతసాలిపేటలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని సోమవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం, కురుపాం మార్కెట్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే సందర్శించారు.