E.G: తాళ్ళపూడి మండలం మలకపల్లిలో PACS సొసైటీ వారి ద్వారా CSR ఫండ్స్ నుంచి మలకపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు రూ.25 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర ఈరోజు అందజేశారు. అనంతరం టెన్నికాయిట్, వాలీబాల్, కబడ్డీ కోర్ట్‌లను ప్రారంభించారు. అలాగే, క్రీడా పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు.