KMR: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు కాంగ్రెస్ పార్టీపై సోమవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ బీసీలకు ద్రోహమని, బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదని, అసెంబ్లీలో చట్ట సవరణ చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్కు చేతకాకపోతే చెప్పాలని, తాము అధికారంలోకి వచ్చాక 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.