KMM: పోక్సో కేసుల్లో నేరస్థులు తప్పించుకునే ప్రమాదం లేదని అదనపు డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో భరోసా కన్వెర్జెన్సీ సమావేశం సోమవారం ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగింది. ముఖ్యతిధిగా మొదటి అదనపు జిల్లా జడ్జి కె.ఉమాదేవి హాజరై భాదితులకు భరోసా, నష్టపరిహారం, పునరావాసం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.