VZM: వితంతువులకు పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలని వైసీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు గుర్ల మండలానికి చెందిన పలువురు వితంతువులతో కలిసి జేసీకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో ID రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేదని జేసీ చెబుతున్నారని.. గ్రీవెన్స్ దేనికోసమని ఆయన ప్రశ్నించారు.