PDPL: పాలకుర్తి మండలం గుడిపల్లి, జయ్యారం, కుక్కల గూడూరు గ్రామాలకు చెందిన 191 మంది రైతులకు 340 యూరియా బస్తాలను సోమవారం పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా 100 బాటిళ్లను అందించామన్నారు. జయ్యారం క్లస్టర్ AEO యోజన, కుక్కల గూడూరు AEO సుష్మ అధికారులు పాల్గొన్నారు.