PPM: ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం గుమ్మలక్ష్మీపురంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తానన్నారు.