నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం హింసకు దారి తీసింది. ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో ఒకరు మరణించగా.. 80 మందికిపైగా గాయపడ్డారు. ఆందోళనకారులు నేపాల్ పార్లమెంట్ వద్ద దూసుకెళ్లారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపి ఆందోళనకారులను అదుపు చేయాల్సి వచ్చింది. రాజధాని ఖాట్మండులో అధికారులు కర్ఫ్వూ విధించారు.