‘డీజే టిల్లు’తో విజయం సాధించిన దర్శకుడు విమల్ కృష్ణ మరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమాను చిలకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ‘డీజే టిల్లు’ చిత్రానికి సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాలే ఈ కొత్త ప్రాజెక్ట్‌కి కూడా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇందులో నటించడానికి హీరో వెంకటేష్‌ను నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం.