TG: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా ఉంటే ఓటేసేవాళ్లమని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నోటా లేదు కాబట్టే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. యూరియా కొరత వల్ల రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల సమస్య పరిష్కరించినోళ్లకే ఓటేస్తామని ముందుగానే చెప్పామంటూ కేటీఆర్ వివరించారు. కానీ ఎవరూ పరిష్కరించలేదని విమర్శించారు.